Header Banner

మళ్లీ గెలికితే ఇక విధ్వంసమే.. జేడీ వాన్స్ ఫోన్ కాల్.. క్లారిటీ ఇచ్చిన మోదీ!

  Sun May 11, 2025 21:04        Politics

భారత్, పాకిస్థాన్ మధ్య సోమవారం జరగనున్న కాల్పుల విరమణ చర్చలకు కొన్ని గంటల ముందు కీలక పరిణామం చోటుచేసుకుంది. అమెరికా సంయుక్త రాష్ట్రాల (యూఎస్‌ఏ) ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఫోన్‌లో మాట్లాడారు. ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై ఆరా తీసినట్లు సమాచారం. ఈ సంభాషణ, రేపటి చర్చల ప్రాముఖ్యతను మరింత పెంచింది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, జాతీయ భద్రత విషయంలో భారత వైఖరిని జేడీ వాన్స్‌కు నిక్కచ్చిగా తెలియజేశారు. పాకిస్థాన్ వైపు నుంచి ఏదైనా దుందుడుకు చర్య చేపడితే, అందుకు తగిన రీతిలో ప్రతిస్పందించడానికి భారత్ వెనుకాడబోదని ఆయన స్పష్టం చేశారు. తమ సంయమనాన్ని బలహీనతగా పరిగణించవద్దని, దేశ సార్వభౌమత్వం, భద్రత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడే ప్రసక్తే లేదని మోదీ పేర్కొన్నట్లు తెలిసింది. ముఖ్యంగా, ఉగ్రవాదం విషయంలో భారత్ ఏమాత్రం ఉపేక్షించబోదని ఆయన తేల్చిచెప్పారు. గతంలో కూడా, కశ్మీర్ అంశంపై, ప్రత్యేకించి పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే) విషయంలో ప్రధాని మోదీ తమ ప్రభుత్వ వైఖరిని అనేకసార్లు స్పష్టం చేశారు. పీఓకే పూర్తిగా భారతదేశ అంతర్భాగమని, ఈ విషయంలో ఎలాంటి చర్చలకు తావులేదని, ఎవరి మధ్యవర్తిత్వం కూడా అవసరం లేదని అమెరికాకు పరోక్షంగా సూచించారు. పీఓకేను శాంతియుతంగా భారత్‌కు అప్పగించడం ఒక్కటే పాకిస్థాన్‌ ముందున్న మార్గమని మోదీ గతంలోనే దృఢంగా ప్రకటించిన విషయం విదితమే. భారత్, పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో, ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయని తొలుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ప్రకటించడం గమనార్హం. ఈ పరిణామాల అనంతరం కూడా, పాకిస్థాన్ నుంచి ఎలాంటి దుశ్చర్యలు ఎదురైనా ఎదుర్కొనేందుకు భారత సైన్యం 'ఆపరేషన్ సిందూర్'ను కొనసాగించనున్నట్లు స్పష్టం చేసింది. సరిహద్దుల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరిగినా, వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు తాము సర్వసన్నద్ధంగా ఉన్నామని భారత ప్రభుత్వం సంకేతాలు పంపింది. 

 

ఇది కూడా చదవండి: చిన్న సేవింగ్ పెద్ద లాభం! రోజుకు రూ.166 కడితే చాలు రూ.8 లక్షలు మీ ఖాతాలోకి.. స్కీమ్‌ గురించి మీకు తెలుసా?

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

విడదల రజిని ఓవరాక్షన్.. ఎట్టకేలకు అరెస్టు! మాజీ మంత్రితోపాటు కారులో..

 

ప్రమాదంలో శ్రీశైలం ప్రాజెక్టు.. స్పిల్‌ వే వద్ద భారీ గొయ్యి - జారిపోతున్న కొండ గట్లు!

 

వీరజవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలకు ఏపీ మంత్రులు! మార్గమంతా ప్రజలు పెద్ద సంఖ్యలో..

 

చంద్రబాబు శుభవార్త.. రైతుల అకౌంట్‌లలో డబ్బులు జమ! ఆ పథకం వారందరికి అసలు వర్తించదు..

 

ఏపీకి మరో కొత్త రైల్వే లైను! ఆ రోట్లోనే.. ! వారికి పండగే పండగ!

 

విద్యార్ధుల కోసం మరో పథకం తెస్తున్న కూటమి ప్రభుత్వం..! అప్పటి నుంచే అమల్లోకి!

 

బెట్టింగ్ మాఫియాకు షాక్! ఇద్దరు బుకీలు అరెస్ట్.. మాజీ కేసులు మళ్లీ రంగంలోకి!

 

పొరపాటున వేరే రైలెక్కిన మహిళ..! ఇంతలోనే ఎంత ఘోరం..!

 

హైదరాబాద్‌ విమానాశ్రయంలో హై అలెర్ట్! డ్రోన్లకు నో పర్మిషన్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Modi #Meeting #TamilNadu